'చిత్రలహరి' ట్రైలర్ విడుదల
- April 07, 2019
'నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలో లేదు. ఆ విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను' అంటున్నారు సాయి ధరమ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. తన జీవితం ఎంత నరకంగా ఉందో ధరమ్ తేజ్ వివరిస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ మొదలైంది. 'ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను..' అని ధరమ్ తేజ్ బాధపడుతూ చెబుతున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఏప్రిల్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..