కేరళ విషు ఫెస్టివల్ సద్యా కోసం సిద్ధమైన ఖతార్ రెస్టారెంట్స్
- April 15, 2019
భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వలసదారులకోసం ఖతార్‌లోని రెస్టారెంట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కేరళ వాసులకు ఎంతో ప్రత్యేకమైన విషు ఫెస్టివల్ నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశాయి ఆయా రెస్టారెంట్స్. ఈ ఫెస్టివల్‌లో ప్రత్యేకమైన మిడ్ డే మీల్ సాద్యాని అందించేందుకు రెస్టారెంట్స్ సన్నాహాలు పూర్తి చేశాయి. సాద్యాలో 24 నుంచి 28 డిషెస్ సింగిల్ కోర్స్‌లో వుంటాయి. అతి పెద్దది 64కి పైగా ఐటమ్స్‌ని కలిగి వుంటుంది. కేరళలోని వివిధ ప్రాంతాల్ని బట్టి ఇంగ్రెడియంట్స్ కొంచెం అటూ ఇటూగా మారతాయి. అన్నిటిలోనూ కామన్‌గా వుండే రైస్, పికెల్, దాల్, అవియాల్, కూట్టుక్కరి అతి ముఖ్యమైనవి. కేరళ వాసుల కోసం ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన ఇంగ్రెడియంట్స్‌ని హైపర్ మార్కెట్స్ అందుబాటులో వుంచాయి. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేనివారికి రెస్టారెంట్స్ అద్భుతమైన రుచితో సాద్యా ప్యాకేజీలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







