కువైట్ విమానాశ్రయంలో బాంబు కలకలం
- April 15, 2019
కువైట్: కువైట్ విమానాశ్రయంలో ఓ గుర్తు తెలియని పార్శిల్ కలకలం సృష్టించింది. కువైట్ నుంచి అమెరికాకు దాన్ని కొరియర్ చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఓ పుస్తకం సైజులో ఉన్న ఆ పార్శిల్ ఏంటో, ఎవరు పంపారో వివరాలు తెలియరాలేదు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఆ ప్యాకేజిని పరిశోధించడానికి ఫోరెన్సిక్ నిపుణులకు పంపించింది. రొటీన్ కార్గో చెకింగ్‌లో భాగంగా కొరియర్ చేస్తున్న వస్తువులను పరిశీలిస్తుండగా ఈ అనుమానాస్పద పార్శిల్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ పార్శిల్‌లో బాంబు ఉందేమోనని వారు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పార్శిల్‌లో బ్యాటరీలు, డైనమైట్ తయారీలో ఉపయోగించే టీఎన్‌టీ అనే పదార్థం ఉన్నాయని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ పార్శిల్‌ను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







