బహ్రెయిన్ లో తెలంగాణ వాసి ఆత్మహత్య
- April 21, 2019
తెలంగాణ:స్వగ్రామంలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్ వెళ్లిన ఓ గీతకార్మికుడిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. గల్ఫ్‌లో సంపాధించుకుందామని కోటి ఆశలతో వెళ్లిన అతడికి చావే శరణ్యమైంది. పనిచేస్తున్న కంపెనీవారు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం..ఇంటివద్ద అప్పుల వాళ్ల వేధింపులు అధికం కావడంతో మనోధైర్యం కోల్పోయిన కార్మికుడు గల్ఫ్‌లో పనిచేస్తున్న కంపెనీలోనే సహచర కార్మికుల సాక్షిగా శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్మాస్‌పూర్‌కు చెందిన బత్తిని శ్రీనివాస్‌గౌడ్ (38) అనే గీత కార్మికుడు మూడేళ్లక్రితం గల్ఫ్‌లోని బహ్రెయిన్ దేశానికి రూ.2.50 లక్షలు అప్పుచేసి కంపెనీ విసాపై వెళ్లాడు.
రెండేళ్లకు తిరిగి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ తిరుగు వీసాపై ఏడాదిక్రితం రెండోసారి బహ్రెయిన్ వెళ్లాడు. కంపెనీలో పని అంతంత మాత్రంగానే ఉండడంతో చేసిన అప్పులు చెల్లించలేకపోయాడు. దీనికి తోడు నాలుగు నెలలుగా కంపెనీ నిర్వాహకులు జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. స్వగ్రామం నుంచి అప్పులు ఇచ్చినవారు ఫోన్ల ద్వారా బాకీ చెల్లించాలని ఒత్తిడి చేయడం, అక్కడ జీతాలు రాకపోవడంతో మరోమార్గం కానరాక పనిచేస్తున్న కంపెనీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్ఫ్ వెళ్లడానికి, కుటుంబ పోషణకోసం రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య, పిల్లలు రోడ్డునపడ్డారు.
మృతునికి భార్య శ్యామల, కూతురు సహస్త్ర, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..