సౌదీ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న విమానంలో విషాదం
- April 23, 2019కాన్బెర్రా: ఓ మాజీ నర్సు సౌదీ నుంచి ఆస్ట్రేలియా పయనమైంది. తన వెనుక సీట్లో పసివాడి ఏడుపు వినిపించి.. ఆ జంట వద్ద నుంచి పిల్లాడిని తీసుకొని ఆడించింది. కాసేపటికి పిల్లాడు ఏడుపు ఆపడంతో వాడిని తల్లిదండ్రులకు అప్పగించింది. ఆ తర్వాత తన పనిలో తను మునిగిపోయింది. ఓ ఎయిర్‌హోస్టెస్ బలంగా తన భుజాన్ని కదపడంతో ఈ లోకంలోకి వచ్చి.. ఏం జరిగిందంటూ ఆ ఎయిర్‌హోస్టెస్‌ను ప్రశ్నించింది. వెనక సీట్లోని జంట చేతుల్లో పసివాడి మొహం రంగు మారడం చూపించిన ఆ ఎయిర్‌హోస్టెస్.. పసివాణ్ణి ఆ నర్సు చేతిలో పెట్టింది. ఆ పిల్లవాడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గుర్తించిన ఆ నర్సు.. విమానంలో ఎవరైనా డాక్టరున్నారా అంటూ కేకలేసింది. అలా అరుస్తూండగానే.. ఆమె కళ్లముందే ఆ పసివాడు ఊపిరి వదిలాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. సౌదీ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న ఎయిర్ఏసియా విమానంలో జరిగిన ఈ ఘటన తన హృదయాన్ని కుదిపేసిందని చెప్పింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ