ప్లిప్‌కార్ట్‌లో 50 వేల ఉద్యోగాలు..
- April 24, 2019
ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తుంది. లాజిస్టిక్స్ రంగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్లిప్‌కార్ట్. దీనిద్వారా 50,000ల ఉద్యోగాలకు రూపకల్పన జరుగుతుందని ఓ అంచనా. ఇప్పటికే ప్లిప్కార్ట్ని నడిపిస్తున్న వాల్‌మార్ట్ గురుగ్రామ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్లో లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటు కోసం 300 ఎకరాల భూమిని సేకరిస్తుంది. భారతదేశంలో ప్రధాన పోటీదారుగా ఉన్న అమెజాన్‌ను ఢీ కొట్టేందుకు ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయని వాల్‌మార్ట్ భావిస్తోంది. ఈ లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా, పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి. ప్లిప్‌కార్ట్ చేపట్టిన నెక్ట్స్ 200 మిలియన్ కస్ట్‌మర్స్ ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరేందుకు ఈ కొత్త లాజిస్టిక్ పార్కులు తోడ్పడతాయని కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..