'సాహో' సెట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- April 27, 2019
ముంబయి: ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'సాహో'. శ్రద్ధాకపూర్ కథానాయిక. ప్రస్తుతం ముంబయిలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 'సాహో' బృందాన్ని కలిశారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్, సుజీత్‌లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న 'సాహో'ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శంకర్-ఎషెహన్-లాయ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..