మోదీపై పోటీకి సిద్దమవుతున్న రైతులు.. అడ్డుకుంటున్న పోలీసులు
- April 28, 2019
వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి సై అన్న నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు వారణాసి చేరుకున్నాయి. అయితే నామినేషన్లు వేసేందుకు వెళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెదిరింపులు, వేధింపులతో భయాందోళనకు గురి చేస్తున్నారు అక్కడి పోలీసులు. నామినేషన్లు వేయకుండా అడుగడుగునా రైతులను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు నిజామాబాద్ నుంచి వారణాసికి వెళ్లిన 50 మంది రైతులు..నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే యూపీ ఇంటలిజెన్స్ వర్గాలు నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల నామినేషన్‌కు మద్దతుగా సంతకం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. లోకల్ షూరిటీ ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇంతకుముందు కొందరు ముందుకొచ్చినా స్థానిక బీజేపీ నేతల ఒత్తిడి వెల్ల వారు వెనక్కు తగ్గుతున్నారు. దీంతో ప్రపోజల్స్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ చెందిన రైతులు నామినేషన్ వేసేందుకు వారణాసి బయలుదేరి వస్తున్నారని తెలుసుకున్న స్థానిక పోలీసులు.. కొన్ని కారణాలను సాకుగా చూపుతూ వారిని అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన రైతులు…వెనక్కి తగ్గకుండా నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు.
అంతే కాదు అటు బీజేపీ కార్యకర్తలు నేతలు కూడా రైతులను నామినేషన్లు వేయకుండా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిన్న నామినేషన్లు వేయకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు రైతులు చెబుతున్నారు. పసుపు బోర్డు, పసుపునకు మద్దతు ధర కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన తమను.. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని… ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము నామినేషన్లు వేసి తీరుతామని అంటున్నారు.
వారణాసి బయలుదేరినప్పుటి నుంచి వారికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. వారణాసి వెళ్లేందుకు మొదట రైతులు రైలు బోగీ బుక్ చేసుకున్నా… చివరి నిమిషంలో అధికారులు రద్దు చేశారు. దీంతో బస్సు ఏర్పాటు చేసుకొని వెళ్లారు. వారికి అక్కడకు వెళ్లాక నామినేషన్ కు మద్దతుగా సంతకం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కావాలనే తమ నామినేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిజామాబాద్ రైతులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..