టీచర్‌ సాహసం: హర్ముజ్‌ స్ట్రెయిట్‌ మీదుగా స్విమ్మింగ్‌

- May 01, 2019 , by Maagulf
టీచర్‌ సాహసం: హర్ముజ్‌ స్ట్రెయిట్‌ మీదుగా స్విమ్మింగ్‌

మస్కట్‌: ఇరానియన్‌ టీచర్‌ ఒకరు ఒమన్‌లోని ఖసబ్‌ నుంచి ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ వరకు స్విమ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇరానియన్‌ క్యాలెండర్‌లో స్పెషల్‌ డే సందర్భంగా ఈ అరుదైన సాహసానికి శ్రీకారం చుడుతున్నారాయన. మొహమ్మద్‌ అమిరి రూడాన్‌ అనే వ్యక్తి సహజంగా అడ్వంచర్స్‌ని ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్ట్రెయిట్‌ ఆఫ్‌ హొర్ముజ్‌ మీదుగా స్మివ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. మొహమ్మద్‌ అమిరి రూడాన్‌ టీచర్‌గా పనిచేస్తున్నారనీ, ప్రతి యేడాదీ ప్రత్యేకమైన రోజున తన సాహసాలతో మరింత ప్రత్యేకంగా మార్క్‌ చేస్తుంటారని చెప్పారు మస్కట్‌లోని ఇరానియన్‌ ఎంబసీ ప్రతినిథులు. ఇరానియన్‌ డే సందర్భంగా ఆయన చేస్తున్న ఈ సాహసాలు చాలామందికి స్ఫూర్తినిస్తాయని వారు అంటున్నారు. కసబ్‌, బందర్‌ అబ్బాస్‌ మధ్య దూరం 120 కిలోమీటర్లు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com