బలాద్నా ఫామ్‌ని సందర్శించిన అమిర్
- May 02, 2019
దోహా: అమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, బలాద్నా ఫామ్‌ని సందర్శించారు. డెయిరీ ఫార్మింగ్, డైరీ ప్రొడక్షన్ మరియు బలాద్నా ఫుడ్ ఇండస్ట్రీస్‌లో జ్యూస్ ప్రొడక్షన్‌కి సంబంధించి లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నారు అమిర్ షేక్. బలాద్నా ఫుడ్ ఇండస్ట్రీస్, ఖతార్ మెయిన్ ప్రొడ్యూసర్‌గా ఫ్రెష్ డెయిరీ ఉత్పత్తులకు పేరుగాంచింది. ఫ్రూట్ జ్యూస్ మార్కెట్‌లోకి ఇటీవలే ప్రవేశించిన బలాద్నా, ఆరు రకాలైన ఫ్లేవర్స్‌తో ఫ్రెష్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేస్తోంది. 2014లో స్మాల్ ఫామ్‌గా బలాద్నా ఏర్పాటయ్యింది. 2017 నుంచి ఇక్కడ పరిణామాలు వేగంగా మారాయి. కేవలం 20 నెలల్లోనే అనూహ్య ప్రగతి సాధించింది. 320 టన్నుల తాజా మిల్క్‌ని ఇప్పుడు ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఖతార్ ఇప్పటికే 100 శాతం సెల్ఫ్ సఫీషియెన్సీని మిల్క్ ప్రొడక్షన్‌లో సాధించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ