అమ్మాయిలు, అబ్బాయిల అరెస్ట్‌

- May 02, 2019 , by Maagulf
అమ్మాయిలు, అబ్బాయిల అరెస్ట్‌

కువైట్‌ సిటీ: కువైట్‌ సిటీలోని డౌన్‌టౌన్‌ ఏరియాలో కొందరు యువతీ యువకులు అభ్యంతరకరంగా వ్యవహరిస్తుండడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. సమీపంలోని రెసిడెంట్స్‌ ఫిర్యాదు చేయడంతో తాము సంఘటనా స్థలానికి చేరుకుని, యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఉల్లంఘనలకు ఇంకెప్పుడూ పాల్పడబోమని యువతీ యువకులు హామీ పత్రాలపై సంతకం చేయడంతో వారిని విడిచిపెట్టారు. ఓపెన్‌ ఏరియాలో కార్లలోని సౌండ్‌ సిస్టమ్‌ని వినియోగించుకుని అసభ్యకరమైన రీతిలో డాన్సులు చేస్తూ నిందితులు న్యూసెన్స్‌ క్రికెట్‌ చేసినట్లు రెసిడెంట్స్‌, పోలీసులు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com