పరగడుపునే నెయ్యి తాగితే...
- May 03, 2019
సాధారణంగా మనలో చాలా మందికి ప్రతిరోజూ ఉదయం నిద్ర లేస్తూనే బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ లేదా కాఫీ చుక్క గొంతులో పడందే బెడ్ మీద నుండి పైకి లేవరు. నిజానికి ఉదయాన్నే కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యి తాగితే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఓ సారి చూడండి.
ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి.
* ఉదయం పరగడుపున నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
* నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
* ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
* అల్సర్‌తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..