అమెజాన్‌లో ఆఫర్లు..
- May 03, 2019
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సమ్మర్ సేల్‌లో భారీ ఆఫర్లతో వినియోగదార్లను ఆకర్షించనుంది. ఈనెల 4 నుంచి 7 వరకు నాలుగు రోజుల పాటు సాగే సమ్మర్ సేల్‌లో సేల్స్‌ని పెంచుకునేందుకు భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ప్రైమ్ మెంబర్లకు మే 3న మధ్యాహ్నం 12 గంటలకు ఎర్లీ ప్రివ్యూ ఆఫర్ చేస్తోంది. ఇక యాప్ డౌన్లోడ్ చేసుకునే కస్టమర్లకు రూ.5 లక్షల విలువైన బహుమతులు ప్రకటించింది. మరి కొద్ది రోజుల్లో ఒన్ ప్లస్ 7, ఒన్ ప్లస్ 7 ప్రొ లాంఛ్ కానున్న సందర్భంలో ఒన్ ప్లస్ 6టీ మోడల్స్ సేల్స్‌ను పెంచుకునేందుకు భారీ తగ్గింపులను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే ఈ ఫోన్‌పై రూ.3,000 డిస్కౌంట్ నడుస్తుండగా, మరోసారి ఈ సేల్ ద్వారా మరింత డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో రూ.41,999తో లాంఛ్ చేసిన ప్రోడక్ట్‌ను రూ.32,999కే ఆఫర్లో అందిస్తోంది. రూ 10,990తో లాంఛ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం 20ను సమ్మర్సేల్లో రూ 9,990కు ఆఫర్ చేస్తోంది. రూ 71,000తో లాంఛ్ అయిన గెలాక్సీ ఎస్10ను సేల్‌లో రూ 61,900కు ఆఫర్ చేస్తోంది. ఇంకొన్న మోడళ్లుచ ఉత్పత్తులపై కూడా భారీ ఆఫర్ల, డిస్కౌంట్లతో సమ్మర్‌ని కూల్ చేసే పనిలో ఉంది అమెజాన్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..