'బుర్రకథ' టీజర్ రిలీజ్
- May 06, 2019
ఆది సాయికుమార్ కథానాయకుడిగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'బుర్రకథ' రూపొందుతోంది. మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ రెండు బ్రెయిన్లు వున్న యువకుడిగా కనిపించనున్నాడని ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ఒక బ్రెయిన్ ఒకలా .. మరో బ్రెయిన్ ఒకలా పనిచేస్తూ ఉంటాయి. దాంతో ఆయన అలవాట్లలోను .. అభిరుచుల్లోను వెంటవెంటనే వేరియేషన్స్ కనిపిస్తూ వుంటాయి. ఈ సమస్య కారణంగా హీరో ఎలాంటి ప్రమాదంలో పడతాడు? ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. ఈ మధ్యలోనే కావాల్సినంత కామెడీని పండించారనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమా అయినా ఆది సాయికుమార్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..