దుబాయ్ వాహనదారులకు రమదాన్ వార్నింగ్
- May 06, 2019
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆతృతతో వాహనాల్ని వేగంగా నడపరాదని దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్‌ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలనీ, తద్వారా రమదాన్ మరింత ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. దుబాయ్ పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, రమదాన్ మాసంలో ప్రత్యేకంగా పోలీసులు ట్రాఫిక్ విషయమై జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, దుబాయ్ రెసిడెంట్స్, పోలీసులకు సహకరించాలనీ కోరారు. ముఖ్యంగా మాస్క్‌ల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. రోడ్ సేఫ్టీ నిబంధనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధంగా వుంటారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పెట్రోల్స్, మోటరిస్టులకు ఇఫ్తార్ మీల్స్ అందిస్తారని కూడా వివరించారాయన. వాహనాల పార్కింగ్ విషయంలో కూడా వాహనదారులు నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!