అక్షయ్ కుమార్.. రియల్ హీరో
- May 07, 2019
పెను తుపాను బాధితులు ధైర్యంగా ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ట్వీట్ చేశాడు. ఫొని దెబ్బకు విలవిల్లాడిన ఒడిశాకు ఆపన్నహస్తం అందించాడు అక్షయ్. ప్రకృతి విధ్వంసంలో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి కోటి తుపాను సాయం ప్రకటిస్తూ, మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఆయా ప్రాంతాలకు తనవంతు సాయం అందించటం అక్షయ్‌కు కొత్త కాదు. కేరళ, చెన్నై ప్రాంతాల్లోనూ ఇటీవల తుపాన్లు భీభత్సం సృష్టించినపుడు -అక్షయ్ తనవంతు సాయాన్ని ప్రకటించాడు. '్భరత్ కే వీర్' వెబ్సైట్ ద్వారా జవానుల కుటుంబాలను ఆదుకోవడం నాకు సంతృప్తినిచ్చే విషయమని పదేపదే చెప్పే అక్షయ్‌కుమార్, ఇటీవలి కాలంలో దేశభక్తి చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడమూ తెలిసిందే. పెను తుపానుగా విరుచుకుపడిన ఫొని, ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..