మస్కట్‌లోని రువీ చౌక్ వద్ద హైదరాబాదీ కమ్యూనిటీ ఇఫ్తార్ విందు
- May 14, 2019
మస్కట్: హైదరాబాదీ కమ్యూనిటీ, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తోంఇ. రువీలో మే 17, శుక్రవారం ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ సోషల్ క్లబ్ డెక్కనీ వింగ్ నేతృత్వంలో ఈ సారి ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటవుతోంది. మఘ్రెబ్ ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందు వుంటుందని నిర్వాహకులు తెలిపారు. మహిళలకు, పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇఫ్తార్ ఆర్గనైజర్లలో ప్రముఖులైన సుమైల్ ఖాన్ మాట్లాడుతూ, 17 ఏళ్ళ క్రితం హైదరాబాదీ కమ్యూనిటీ ఇఫ్తార్ ప్రారంభమయ్యిందని చెప్పారు. సాటి మనుషులకు సాయం చేయడమే ఇస్లాం పవిత్ర ఉద్దేశ్యమనీ, ఈ క్రమంలో తమవంతుగా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!