తలకు గాయంతో వ్యక్తి మృతి
- May 14, 2019
బహ్రెయిన్:ఓ గొడవలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ వలసదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని హర్దీప్ సింగ్ సెఖాన్‌గా గుర్తించారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో వైద్య చికిత్స పొందుతూ హర్దీప్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గొడవ ముదరడంతో గ్రూప్ ఆఫ్ పీపుల్ కొట్టుకున్నారనీ, ఈ క్రమంలో మిగతావారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారనీ, హర్దీప్ మాత్రం తలకు తీవ్రంగా గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కాలికి తీవ్ర గాయమయ్యింది. అతనికీ వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నలుగుర్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. రిఫ్ఫా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







