'గేమ్‌ ఓవర్‌' టీజర్‌ విడుదల

'గేమ్‌ ఓవర్‌' టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: కథానాయిక తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'గేమ్‌ ఓవర్‌'. అశ్విన్‌ శరవనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ప్రచార చిత్రంలో తాప్సిని మాత్రమే చూపించారు. ఆమె గేమ్స్‌ను డిజైన్‌ చేసే అమ్మాయి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. తాప్సిని హత్య చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించారు. 'మనకు రెండు జీవితాలు ఉంటాయి.. రెండోది మొదలయ్యే సరికీ.. ఒక జీవితమే ఉందని అర్థం అవుతుంది' అంటూ కథను టీజర్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు సంభాషణలను వెంకట్‌ కాచర్ల రాశారు. రోన్‌ ఎథాన్‌ యోహన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Back to Top