ఇంద్రకీలాద్రి పై మహేష్
- May 18, 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మహర్షి చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి రైతుల ప్రాముఖ్యతని తెలియజేసేలా తెరకెక్కించిన ఈ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా మహర్షి విడుదలై వారం గడచినా చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహేష్ బాబు స్వయంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మహర్షికి ప్రచారం కల్పిస్తున్నాడు.
ఇదిలా ఉండగా నేడు(శనివారం) మహేష్ బాబుతో పాటు మహర్షి చిత్రయూనిట్ విజయవాడకు చేరుకున్నారు. కొద్ది సేపటిక్రితమే మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత పీవీపీ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. మహర్షి చిత్ర బృందానికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు.
దీనితో మహేష్ బాబుని చూసేందుకు ఆలయంలో ప్రజలు ఎగబడ్డారు. నేడు మహర్షి చిత్ర విజయోత్సవ వేడుక విజయవాడలోని సిద్దార్థ్ కళాశాలలో జరగనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ సీఈఓగా, రైతుల సమస్యలని పరిష్కరించే వ్యక్తిగా మూడు విభిన్న కోణాల్లో నటించి మెప్పించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..