అమెరికా:యువతిని వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు

- May 19, 2019 , by Maagulf
అమెరికా:యువతిని వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు

అమెరికాలో ఆకతాయి గ్యాంగ్ చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. భారతీయ సంతతికి చెందిన అరియనా అమెరికాలోని మేరీలాండ్‌ లో ఉంటోంది. చదువు పూర్తి చేసి. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. గత నెల 11న తాను ఆశ్రయం పొందే యూత్‌ గ్రూప్‌ హోంనుంచి వెళ్లిపోయింది. అనంతరం అదే నెల17న ఇంటికి వెళ్లేందుకు తన తల్లికి తెలిసిన ఓ వ్యక్తిని కలిసి ఇంటిలో తనను దించాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో ఆకతాయి గ్యాంగ్ వీరు ప్రయాణిస్తున్న కారును ఫాలో అయింది. కొంత దూరం వెళ్ళాక కారును అడ్డగించారు. వారు ఎందుకు వచ్చారో తెలియక అరియనా అయోమయానికి గురైంది. ఈక్రమంలో అరియానా వెంట ఉన్న వ్యక్తిని కారులోనుంచి బయటికి లాగేసి అక్కడే తీవ్రంగా కొట్టారు. అనంతరం ఓ పాడుబడ్డ ఇంటిలోకి అతనిని తీసుకెళ్లి అర్ధనగ్నంగా నిల్చోబెట్టి హింసించారు.

ఆ తర్వాత 500 డాలర్లు, ఏటీఎమ్‌ కార్డులు లాక్కున్నారు. పోతు పోతు మళ్ళీ అతనిపై చావు దెబ్బలు కొట్టారు. అరియనా వేడుకోవడంతో అతన్ని వదిలేశారు. అతన్ని కొట్టిన విషయం అరియనా పోలీసులకు చెబుతుందన్న అనుమానంతో ఏప్రిల్‌ 18న అరియానాను కిడ్నాప్ చేసి ఓ అపార్టుమెంటులోకి తీసుకువెళ్లారు ఆ గ్యాంగ్. అనంతరం అక్కడే ఉన్న టన్నెల్‌లోకి లాక్కెళ్లి వివస్త్రగా మార్చి ఎస్కోబార్‌.. చెక్క బ్యాట్‌, బేస్‌బాల్‌తో ఆమె తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఈ తతంగాన్నంతా మరో వ్యక్తి వీడియో తీస్తూ రాక్షసానందం పొందాడు. ఈ నేరంలో ఈ గ్యాంగ్ కు హెర్నాండెజ్‌ అనే మరో బాలిక సహకరించింది. అయితే హెర్నాండెజ్‌ భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరియనా హత్యకు కారణమైన 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com