విజయవాడ లో మహర్షి విజయోత్సవం
- May 20, 2019
మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా విజయోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె రాఘ వేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర బృందమంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.మహేష్ విజయాలు చూసి కృష్ణ గారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మహేష్‌ను తెరకు పరిచయం చేసి నందుకు నేనూ ఎంతో గర్విస్తున్నాను. ఈ చిత్రంలో రిషిగా మహేష్ ప్రయా ణం బాగుంది. రైతు బాగుండాలని చెప్పే అంశం ఆకట్టుకుంది. మే 9ని మహర్షి డేగా ప్రకటించాలి. అన్నారు. మహేష్ బాబు మాట్లా డుతూ.నేను స్టార్ హీరో అవుతానని తొలి చిత్రం అప్పు డే రాఘవేంద్రరావు గారు చెప్పారు. మంచి సినిమాతో నాకు కెరీర్‌ను ఇచ్చారాయాన. మహర్షి సినిమా చిత్రీకరణ ప్రారంభించినప్పుడే ఇది మరో పోకిరి అవుతుందని ఆశించాను. మంచి సినిమా చేస్తే అభిమానులు ఎంత సహకరిస్తారో నాకు తెలుసు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. అని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..