షార్జా మాస్క్‌ల వద్ద కొత్తగా 96 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు
- May 20, 2019
షార్జాలోని పలు మాస్క్‌ల వద్ద షార్జా ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొత్తగా 96 పార్కింగ్ లాట్స్‌ని ప్రార్థనల కోసం వచ్చేవారికి ఏర్పాటు చేసింది. పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు. అల్ ఇమ్రాన్ మాస్క్ వద్ద 56 పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్ స్పాట్స్‌ని లింక్ చేయడానికి 150 మీటర్ల పొడవైన రోడ్డుని కూడా నిర్మించారు. అలాగే ఇంటిగ్రటేఎడ్ రెయిన్ వాటర్ డ్రెయినేజ్ సిస్టమ్‌ని కూడా మాస్క్ వద్ద ఏర్పాటు చేశారు. హబీబ్ బిన్ జాయెద్ మాస్క్ వద్ద 40 పార్కింగ్ లాట్స్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్‌ఆర్‌టిఎ డైరెక్టర్ ఆఫ్ రోడ్ మెయిన్టెనెన్స్ డాక్టర్ మొహిసిన్ బల్వాన్ తెలిపారు. అల్ నూఫ్ పార్క్ 3 విజిటర్స్ కోసం 1.1 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో పార్కింగ్ స్పేసెస్‌ని నిర్మించారు. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేస్తూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..