దుబాయ్ ఆర్టిఎ, టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం
- May 23, 2019
భారత కన్సల్టెన్జీ జెయింట్ టాటా కన్సల్టెన్సీ, దుబాయ్ ఆర్‌టిఎకి సహాయ సహకారాలు అందించనుంది. ఓ స్మార్ట్ యాప్ ద్వారా డ్రైవర్లను మానిటర్ చేసేందుకు వీలుగా ఆర్టిఎతో కలిసి పనిచేయనుంది టాటా కన్సల్టెన్సీ. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ మేరకు ఓ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆర్టిఎ హెడ్ క్వార్టర్స్‌లో కుదిరిన ఈ ఒప్పందానికి సంబంధించి లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అబ్దుల్లా యూసెఫ్ అల్ అలి, టిసిఎస్ రీజినల్ డైరెక్టర్ అజయ్ సింగ్ సంతకాలు చేయడం జరిగింది. మూడు నెలల ట్రయల్ పీరియడ్‌లో టిసిఎస్ ఓ యాప్‌ని తయారుచేసి, ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్లోడ్ చేస్తారు. జిపిఎస్ నేవిగేటర్, 9 యాక్సిస్ ఐఎంయు వంటివి ఇందులోవ ఉంటాయి. ఓవర్ స్పీడింగ్, వీరింగ్, ఒక్కసారిగా బ్రేక్ వేయడం వంటివాటిని ఈ కొత్త సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ డేటా ఆధారంగా ఏ వయసువారు ఎక్కువ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు? వంటి అనేక విషయాల్ని విశ్లేషించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..