హవాలా కేసులో ఇండియన్ ప్రిన్సిపల్ అరెస్ట్
- May 24, 2019
కువైట్: హవాలా కుంభకోణానికి సంబంధించి ఇండియాలో ఓ ముస్లిం క్లరిక్ మరియు బిజినెస్ మేన్‌ని అరెస్ట్ చేశారు. 8,45,000 రూపాయల్ని కువైట్ నుంచి పంపినట్లుగా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. బార్‌పేటలోని జామియా ఇస్లామియా సలాఫియా అరబిక్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు నురుల్ ఇస్లామ్. అతని నుంచి డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తనకు ఆ సొమ్ము కువైట్ నుంచి వచ్చినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసులో బిజినెస్ మేన్ ఆరోన్ సార్ఫ్‌ని కూడా అరెస్ట్ చేశారు. హవాలా డీల్‌కి అరోన్ సహాయ సహకారాలు అందిస్తారు. నురుల్ ఇస్లామ్ గతంలో 28,00,000 రూపాయల్ని యూనివర్సిటీ బ్యాంకింగ్ అకౌంట్‌లో మూడు సెపరేట్ ట్రాన్సాక్షన్స్ రూపంలో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అనైతిక కార్యకలాపాల కోసం నిందితుడు ఈ డబ్బుని వినియోగించి వుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ ద్వారా హవాలా సిస్టమ్ నడుస్తుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..