న్యూ ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్కి ఇఫ్తార్
- May 25, 2019ఈ శుక్రవారం, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లింలకు, నాన్ ముస్లింలకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 400 మందికి ఇఫ్తార్ ఏర్పాట్లు చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ బుర్ దుబాయ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పదేళ్ళుగా ఈ సెంటర్ ఇఫ్తార్ విందులను నిర్వహిస్తూ వస్తోంది. మెనూలో చికెన్, లాంబ్ బిర్యానీ, యోగర్ట్, డ్రింక్స్ మరియు డేట్స్ వుంటాయి. చాలామంది ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి, ఇతరులతో ఇక్కడ పంచుకుంటుంటారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా అల్లా ఆశీర్వాదం పొందవచ్చునన్నది వారి నమ్మకం.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్