ఎస్పీకి 'స్వరకళాసామ్రాట్‌' బిరుదు..

- January 02, 2016 , by Maagulf
ఎస్పీకి 'స్వరకళాసామ్రాట్‌' బిరుదు..

విశాఖ కేంద్రంగా విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను సన్మానించారు. ఎస్పీకి స్వరకళాసామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతికి కీర్తి తెచ్చిన వ్యక్తి ఎస్పీ అని కొనియాడారు. బాలసుబ్రహ్మణ్యం ఎందరో గాయకులను వెలుగులోకి తెచ్చారని అన్నారు. 50 ఏళ్ల పాటు ఎలాంటి పోటీ లేకుండా ఆయన రాణించారని పేర్కొన్నారు. విశాఖ భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడ ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతోందని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, తొమ్మిది దేవాలయాల నమూనాల ప్రాంగణం అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లెరఘునాథ్‌రెడ్డి, సంగీత దర్శకుడు కీరవాణి, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com