మోదీకి పోలాండ్ చిన్నారి లేఖ
- June 03, 2019
ప్రధాని మోదీ సహాయం కోసం ఓ చిన్నారి ఎదురు చూస్తోంది… మీరు చాలా పవర్‌ఫుల్ అంటూ ఓ లేఖను కూడా రాసింది. తనకు ఆవులంటే అభిమానమని.. హిందూ సంప్రదాయమంటే ఇష్టమని పేర్కొంది. ఆ చిన్నారి మన భారతీయురాలు కాదు. పోలాండ్ వాసి.. భారత్‌కు వచ్చి ఇక్కడి సంప్రదాయాలు నచ్చి ఇక్కడే ఉండిపోవాలని.. ఇక్కడే చదువుకోవాలని ఫిక్స్ అయిపోయింది. బీ-2 బిజినెస్ వీసాపై తన తల్లితో వచ్చిన అలిక్జా వనాట్కో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండటంతో వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టి తిరిగి వారి దేశానికి పంపించివేశారు.
బీ-2 బిజినెస్ వీసాపై పోలెండ్‌కు చెందిన మార్టా కొట్లార్క్సా అనేకసార్లు భారత్‌కు వచ్చారు. కూడా తన పదకొండేళ్ల కుమార్తె అలిక్జా వనాట్కోను తీసుకొచ్చారు. ఇద్దరూ గోవాలో ఉండేవారు. వీసా నిరాకరించడంతో ప్రస్తుతం భారత్ వదిలి వెళ్లిన వీరు కంబోడియాలో ఉంటున్నారు. అక్కడ నుంచే భారత్‌కు తిరిగొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాఖండ్ చమోలీలో గడువుదాటి ఉన్నట్లుగా విదేశాంగ అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని మార్టా వాపోతున్నారు. ఇదే అంశంపై గతంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సాయం కూడా కోరారు. ఇప్పుడు ప్రధానికి అలిక్జా లేఖ రాయడంతో వీరి గురించి అందరికీ తెలిసింది.
ప్రధాని మోదీకి రాసిన లేఖలో అలిక్జా తనకు భారత్‌లో ఉన్నప్పుడు కలిగిన అనుభూతిని వివరించింది. తమకు న్యాయం చేయాలని శివుడిని, నందాదేవి పర్వతంపై కొలువైన అమ్మవారిని వేడుకుంటున్నట్లు పేర్కొంది. తనకు గోవాలోని స్కూలంటే ఎంతో ఇష్టమని, అక్కడి ప్రకృతి అందాలు కూడా తెగ నచ్చాయి. పశుసంరక్షణ కేంద్రంలో వలంటీర్‌గా ఉండేదాన్నని.. అక్కడ ఆవుల్ని చూసుకునేదాన్నని.. అదంతా ఇప్పుడు మిస్ అవుతున్నట్టు లేఖలో పేర్కొంది. 2019 మార్చి 24న అమ్మ భారత్ రాలేకపోయింది. ఎక్కువ రోజులు ఉన్నామని మమ్మల్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు చెప్పారు. మేము భారతీయులం కాకపోయినా.. భారత్ మాకు ఇల్లు వంటింది. హిందూ సంప్రదాయాలు అంటే ఇష్టం. ప్రస్తుతం నేను అమ్మతో ఉన్నాను. కానీ, నాకిష్టమైన దేశంలో గడిపిన గత జీవితాన్ని మిస్ అవుతున్నాను అని లేఖలో పేర్కొంది 11ఏళ్ల అలిక్జా.
మాకు సాయం చేయమని శివుడిని, నందాదేవిని ప్రార్థిస్తున్నాను. నేను, అమ్మ తిరిగి భారత్ రావడానికి సాయం చేయగల పవర్‌ఫుల్ వ్యక్తి మీరేనని భావించి ఈ లేఖ రాస్తున్నాను. మాపై బ్లాక్‌లిస్ట్ తొలగించి మాకు సాయం చేయండి. అని అలిక్జా ప్రధానిని అభ్యర్థించింది. మరి, ఈ లేఖపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!