హైదరాబాద్ లో కారుమబ్బులు.. భారీ వర్షం!
- June 03, 2019
హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల సమయం వరకు తీవ్ర ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనానికి ఈ సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ అంతా కారు మబ్బులు కమ్ముకోవడంతో నగరం చీకటిమయంగా మారింది. సాయంత్రం 5గంటలకే వాతావరణమంతా మబ్బులతో చల్లబడింది. నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఈఎస్ఐ, ఎస్సార్‌నగర్, మైత్రివనం, మాదాపూర్, సోమాజిగూడ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా.. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో గంటపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
వర్షం కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. ఇప్పటికే అత్యవసర బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోడ్లపై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వద్ద వాహనాలు నిలపవద్దని ప్రజలకు సూచించారు. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడినట్టు సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..