పాఠ్య పుస్త‌కాల్లోకి ర‌జ‌నీకాంత్‌

- June 10, 2019 , by Maagulf
పాఠ్య పుస్త‌కాల్లోకి ర‌జ‌నీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌.. త‌మిళ‌నాడులోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కున్న క్రేజే వేరు. ఆయ‌న సినిమా విడుద‌లంటే ఉండే సందడే వేరు. ఆయ‌న ఎంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ సింపుల్‌గానే ఉంటారు. బ‌స్ కండెక్ట‌ర్‌గా నుండి సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు ఆయ‌న ఎదిగిన వైనం ఎంతో మందికి స్ఫూర్తి దాయ‌కం. ఈయ‌న లైఫ్‌ను పాఠ్యాంశంగా తీసుకురావాల‌ని ఎప్ప‌టి నుండో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఇప్ప‌టికి నేర‌వేరింది.

ర‌జనీకాంత్ జీవితాన్ని క్లుప్తంగా త‌మిళ‌నాడు ఐదవ త‌ర‌గ‌తిలో ఓ పార్యాంశంగా చేర్చారు. `ర్యాగ్ టు రిచెస్‌` అనే పాఠ్యాంశంలో జీవితంలో అట్ట‌డుగు స్థాయి నుండి ఉన్న‌తంగా ఎదిగిన స్టీవ్ జాబ్స్‌, చార్లీ చాప్లిన్‌, జె.కె.రౌండ్‌, ఫ్రాంక్ ఒడియా వంటి వారి జీవితాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ లైఫ్‌ను కూడా యాడ్ చేశారు. కార్పెంట‌ర్ నుండి కండెక్ట‌ర్ అయ్యి.. అక్కడ నుండి సినిమాల్లో సూప‌ర్‌స్టార్‌గా ర‌జ‌నీకాంత్ ఎదిగార‌ని ఆ పాఠంలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com