సాదాసీదాగా గిరీశ్ కర్నాడ్ అంత్యక్రియలు..అంతా ఆయన కోరినట్టే!
- June 11, 2019
బెంగుళూరు: ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీశ్ కర్నాడ్ కోరుకున్నట్లుగానే కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన కర్నాడ్ సోమవారం ఉదయం కర్ణాటకలోని తన నివాసంలో కన్నుమూశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కర్నాడ్‌కు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఐతే ఇందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కేవలం కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో స్థానికి స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాను చనిపోయాక సాదాసీదాగా కార్యక్రమాలు నిర్వహించాలని కర్నాడ్ తమతో ముందే చెప్పినట్లు కుటుంబీకులు మీడియా ద్వారా వెల్లడించారు. అభిమానుల సందర్శనార్ధం భౌతికాయాన్ని కూడా ఉంచలేదు. అంతిమయాత్ర సమయంలో అభిమానులు, పోలీసు బలగాలు వెంటరావడం వంటివి వద్దని కర్నాడ్ చెప్పారట. అందుకే ఆయన కోరుకున్నట్లుగానే అంత్యక్రియలను నిర్వహించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..