అదృశ్యమైన విమాన శకలాలు లభ్యం

- June 11, 2019 , by Maagulf
అదృశ్యమైన విమాన శకలాలు లభ్యం

ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 విమానం శకలాలను గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సయాంగ్ జిల్లాలో విమానం శకలాలు లభ్యం అయ్యాయి. కొద్ది రోజులుగా ఐఏఎఫ్ తోపాటు ఆర్మీ కూడా అదృశ్యమైన విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.గాలింపు చర్యల్లో పాల్గొన్న MI-17 హెలికాప్టర్ సియాంగ్ జిల్లాలో విమాన శకలాలను గుర్తించింది.

13మంది సిబ్బందితో జూన్-3,2019న మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన AN-32 అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా వ్యాలీలో ల్యాండింగ్ కావాల్సివుంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1 గంటకు రాడార్ తో సంబంధాలు తెగిపోయి విమానం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

విమాన ఆచూకీ కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సుకోయ్ -30, సీ-130 జెట్ విమానాలతో ఆపరేషన్ కొనసాగింది. గాలింపు చర్యల్లో భాగంగా ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ తో ఏఎన్ -35 విమానం కోసం వెతుకుతుండగా సియాంగ్ జిల్లాలో విమాన శకాలను గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com