జూన్ 13న ‘మ‌న్మథుడు 2’ టీజ‌ర్‌ రిలీజ్

- June 11, 2019 , by Maagulf
జూన్ 13న ‘మ‌న్మథుడు 2’ టీజ‌ర్‌ రిలీజ్

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా మన్మథుడు 2. చిలసౌతో దర్శకుడిగా సక్సెస్‌ అందుకున్న  రాహుల్ ర‌వీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. నాగార్జున అక్కినేని స్వయంగా పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తయ్యింది. త్వర‌లోనే చివరి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు ర‌కుల్‌, కీర్తిసురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.

ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేస్తూ ఇంట్రస్టింగ్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మ‌న్మథుడు ఇన్‌స్పిరేష‌న్‌తో, రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శక‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com