జూన్ 13న ‘మన్మథుడు 2’ టీజర్ రిలీజ్
- June 11, 2019
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్‌కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా మన్మథుడు 2. చిలసౌతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. నాగార్జున అక్కినేని స్వయంగా పి.కిరణ్ (జెమిని కిరణ్) తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. త్వరలోనే చివరి షెడ్యూల్ చిత్రీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు రకుల్, కీర్తిసురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
ఈ అంచనాలను మరింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు. టీజర్ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్మథుడు ఇన్స్పిరేషన్తో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ ఫన్ రైడర్ తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..