పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మ్యాన్ హోల్లో పడి..
- June 12, 2019అబుధాబి: అరబ్ వ్యక్తి ఒకరు డ్రగ్స్ కేసులో తనపై అభియోగాలు మోపడాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడిపై అనుమానంతో పోలీస్ అధికారి ఒకరు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు పారిపోయాడు. ఈ క్రమంలో అతను మ్యాన్ హోల్లో పడిపోయారు. అతనితోపాటు, పోలీస్ అధికారికి కూడా ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. డ్రగ్స్ కేసుతోపాటు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కేసులోనూ నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే, తన కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై, వైద్య చికిత్స పొందాడనీ, ఈ క్రమంలో డాక్టర్ సూచించిన మందుల్ని వినియోగిస్తున్నాడనీ, మరోపక్క యాక్సిడెంట్ కారణంగా మానసిక సమస్యలూ తలెత్తాయనీ, అంతే తప్ప తన కుమారుడు నేరస్తుడు కాదని నిందితుడి తండ్రి న్యాయస్థానానికి విన్నవించారు. ఈ కేసు విచారణను జూన్ 25కి వాయిదా వేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల