విచిత్ర సమస్య ఎదుర్కొంటున్న రీల్ 'రాహుల్ గాంధీ'
- June 12, 2019`ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్` చిత్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాత్రను పోషించిన అర్జున్ మాథుర్ గుర్తున్నాడా? అతనికి ఓ చిత్రమైన సమస్య ఎదురైంది. సినిమా హీరోలకు అమ్మాయిల నుంచి లవ్ లెటర్స్, మ్యారెజ్ ప్రపోజల్స్ రావడం సాధారణ విషయమే. అయితే అర్జున్‌కు మాత్రం అలాంటి ప్రపోజల్స్ అబ్బాయిల నుంచి వస్తున్నాయట.
అబ్బాయిల నుంచి ప్రపోజల్స్ రావటం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? దానికి కారణం అర్జున్ నటించిన ఓ వెబ్ సిరీసే. `మేడ్ ఇన్ హెవెన్` అనే వెబ్ సిరీస్‌లో అర్జున్ స్వలింగ సంపర్కుడిగా నటించాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాతే అబ్బాయిల నుంచి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని అర్జున్ వాపోతున్నాడు. `నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?` అంటూ అబ్బాయిల నుంచి మెసేజ్‌లు రావడం చాలా ఇబ్బందిగా ఉందని వెల్లడించాడు. తన నటనకు ప్రశంసలు అందుతున్నప్పుడు ఆనందంగానే ఉన్నా.. ఈ పెళ్లి ప్రపోజల్స్ ఏమిటంటూ అర్జున్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నటించే పాత్రలను.. నిజ జీవితాన్ని కలిపి చూడొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!