సౌదీ విమానాశ్రయంపై తిరుగుబాటుదారుల దాడి..- 26 మందికి గాయాలు

- June 13, 2019 , by Maagulf
సౌదీ విమానాశ్రయంపై తిరుగుబాటుదారుల దాడి..- 26 మందికి గాయాలు

రియాద్‌ : సౌదీ అరేబియాలోని ఆభా అంతర్జాతీయ విమానా శ్రయంపై హౌతీ తిరుగు బాటుదారులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌదీ సంకీర్ణదళాల కమాండర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆభా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటు దారులు బుధవారం క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. వీరిలో విదేశీ ప్రయాణీకులే అధికంగా ఉన్నారు. తిరుగుబాటు దారులు క్షిపణి దాడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు ఉపయోగిస్తున్నట్టు సౌదీ అనుమానిస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com