విశాల్ కి వార్నింగ్ ఇచ్చిన స్నేహితురాలు...ఎవరో చూడండి!

- June 14, 2019 , by Maagulf
విశాల్ కి వార్నింగ్ ఇచ్చిన స్నేహితురాలు...ఎవరో చూడండి!

హీరో విశాల్‌కు సీనియర్ నటుడు శరత్ కుమార్‌తో రాజకీయపరమైన విబేధాలున్న సంగతి తెలిసిందే. నడిగర్ సంఘం గత ఎన్నికల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. శరత్ కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మితో కూడా విశాల్‌కు వ్యక్తిగతమైన సమస్యలున్నాయి. ఈమధ్య కొంచెం చల్లబడిన ఈ వివాదాలు తాజాగా 2019-2022కు గాను జరుగుతున్న నడిగర్ సంఘం ఎన్నికల సందర్బంగా బయటపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాల్ మరోసారి శరత్ కుమార్ పై విమర్శలు గుప్పించారు.

దీంతో వరలక్ష్మికి కోపం కట్టలు తెంచుకుంది. పోటీలో లేని నా తండ్రిని అనవసరంగా ఎందుకు తిడుతున్నావ్ అంటూ విరుచుకుపడింది. 'ఎప్పుడూ చట్టం.. చట్టం అంటావ్ కదా.. ఆ చట్టం ప్రకారమే నేరం రుజువుకావివారు నిర్దోషులు. మా నాన్న తప్పు చేసి ఉంటే ఈపాటికి చట్టం చర్యలు తీసుకుని ఉండేది. అయినా ప్రస్తుత ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నా తండ్రిని ఎందుకు విమర్శిస్తున్నావ్. నీ పదవీ కాలంలో నువ్వు చేసిన మంచి పనులేవైనా ఉంటే వాటి గురించి చెప్పుకో. ప్రచారంలో చాలా దిగజారిపోయి ప్రవర్తించావ్. ఇన్నిరోజులు ఒక స్నేహితురాలిగా నీకు మద్దతు ఇచ్చాను. ఇకపై నా సపోర్ట్ నీకు ఉండదు. నా ఓటును కోల్పోయావ్' అంటూ పెద్ద పోస్ట్ పెట్టి దుమారం రేపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com