విశాల్ కి వార్నింగ్ ఇచ్చిన స్నేహితురాలు...ఎవరో చూడండి!
- June 14, 2019
హీరో విశాల్‌కు సీనియర్ నటుడు శరత్ కుమార్‌తో రాజకీయపరమైన విబేధాలున్న సంగతి తెలిసిందే. నడిగర్ సంఘం గత ఎన్నికల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. శరత్ కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మితో కూడా విశాల్‌కు వ్యక్తిగతమైన సమస్యలున్నాయి. ఈమధ్య కొంచెం చల్లబడిన ఈ వివాదాలు తాజాగా 2019-2022కు గాను జరుగుతున్న నడిగర్ సంఘం ఎన్నికల సందర్బంగా బయటపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాల్ మరోసారి శరత్ కుమార్ పై విమర్శలు గుప్పించారు.
దీంతో వరలక్ష్మికి కోపం కట్టలు తెంచుకుంది. పోటీలో లేని నా తండ్రిని అనవసరంగా ఎందుకు తిడుతున్నావ్ అంటూ విరుచుకుపడింది. 'ఎప్పుడూ చట్టం.. చట్టం అంటావ్ కదా.. ఆ చట్టం ప్రకారమే నేరం రుజువుకావివారు నిర్దోషులు. మా నాన్న తప్పు చేసి ఉంటే ఈపాటికి చట్టం చర్యలు తీసుకుని ఉండేది. అయినా ప్రస్తుత ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నా తండ్రిని ఎందుకు విమర్శిస్తున్నావ్. నీ పదవీ కాలంలో నువ్వు చేసిన మంచి పనులేవైనా ఉంటే వాటి గురించి చెప్పుకో. ప్రచారంలో చాలా దిగజారిపోయి ప్రవర్తించావ్. ఇన్నిరోజులు ఒక స్నేహితురాలిగా నీకు మద్దతు ఇచ్చాను. ఇకపై నా సపోర్ట్ నీకు ఉండదు. నా ఓటును కోల్పోయావ్' అంటూ పెద్ద పోస్ట్ పెట్టి దుమారం రేపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..