17 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష

- June 14, 2019 , by Maagulf
17 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్‌: సుప్రీమ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌, 17 మంది భారత జాతీయులైన ఖైదీలకు క్షమాభిక్ష అందించారు. ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్‌ పార్డన్‌ ద్వారా 17 మంది భారత జాతీయులకు విముక్తి కలిగిందనీ, ఈద్‌ అల్‌ ఫితర్‌ సందర్భంగా సుల్తాన్‌ కబూస్‌ ఈ క్షమాభిక్ష ప్రకటించారని ఆ ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. భారత్‌ - ఒమన్‌ మధ్య స్నేహ బంధం చాలా గొప్పదనీ, పెద్ద మనసుతో భారతీయ ఖైదీలకు క్షమా భిక్ష పెట్టడం ఆనందించదగ్గ విషయమని భారత ప్రభుత్వం ఒమన్‌కి పంపిన సందేశంలో పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com