ఇల్లీగల్ ట్యాక్సీ: 3,000 జరీమానా, 24 ట్రాఫిక్ పాయింట్స్
- June 14, 2019
అబుధాబి: ఇల్లీగల్ ట్యాక్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అబుదాబీ పోలీస్ పేర్కొంది. 2019 తొలి క్వార్టర్‌లో 1,573 ఇల్లీగల్ ట్యాక్సీలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్‌తో కలిసి ట్రాన్స్‌పోర్ట్ అథారిటీస్‌కి చెందిన అధికారులు అండర్ కవర్ ఆపరేషన్లు నిర్వహించి ఇల్లీగల్ ట్యాక్సీలను పట్టుకోగలిగారు. ఇల్లీగల్ ట్యాక్సీలకు 3,000 దిర్హామ్‌ల జరీమానాతోపాటు, వారిపై 24 ట్రాఫిక్ పాయింట్లు కూడా విధిస్తామని అబుదాబీ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అవాద్ బిన్ మహిరుమ్ చెప్పారు. ఇల్లీగల్ ట్యాక్సీలు నిర్వహిస్తున్నవారిలో కొందరికి లైసెన్సులు కూడా లేవని ఆయన వివరించారు. ఎక్కువగా లేబరర్స్ ఈ ఇల్లీగల్ ట్యాక్సీలను తక్కువ ధర కారణంగా ఎంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆసియాకి చెందిన వ్యక్తులే ఎక్కువగా వీటిని నడుపుతున్నారని చెప్పారు కల్నల్ ముబారక్ అవాద్.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!