అమెజాన్‌లో ఉద్యోగాలు..
- June 15, 2019
ఆన్‌లైన్ మార్కెట్.. అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే కోరుకున్న వస్తువు క్షణాల్లో మన కళ్ల ముందు ఉంటుంది. ఇక సమ్మర్ సేల్, విటర్ సేల్ లేదంటే ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేసి మరీ కస్టమర్లని ఆకర్షించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. మరి ఈ ప్రొడక్ట్‌లన్నీ సకాలంలో డెలివరీ చేస్తేనే కదా వినియోగదారుడు మళ్లీ మళ్లీ కొనడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం డెలివరీ బాయ్‌లు చాలా మందే కావాలి. అందుకే అమెజాన్ ఇండియా కొత్తగా పార్ట్ టైం జాబ్స్‌కి శ్రీకారం చుట్టింది. ఎవరైనా ఓకే.. కానీ కస్టమర్ కోరిన వస్తువుని సేఫ్‌గా, టైమ్‌కి అందించాలి అంటోంది. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి, హోం మేకర్స్‌కి, రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ని అప్లై చేసుకోమని కోరుతోంది.
Amazon Flex పేరుతో కంపెనీ వేలాది మందికి జాబ్ అవకాశాలను కల్పించాలనుకుంటోంది. పాకెట్ మనీ కోసం అమ్మానాన్న దగ్గర చేయి చాచకుండా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు స్టూడెంట్స్. రోజుకి 4 గంటలు పని చేస్తే చాలు. గంటకు రూ.120 నుంచి రూ.140లు ఇస్తుంది సంస్థ. ప్రతి బుధవారం ఈ మొత్తాన్ని ఆవ్యక్తికి అందజేస్తుంది అమెజాన్. భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, జర్మనీ, స్పెయిన్, జపాన్, సింగపూర్, యూకే దేశాల్లో ఈ సర్వీస్ రన్ చేస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు, బుక్ చేసిన ఐటెం వేగంగా డెలివరీ చేసేందుకు ఈ సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉందని ఆసియా కస్టమర్ ఫుల్ ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెండ్ అఖిల్ సక్సేనా అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..