ఇండియా కు నీళ్ల సాయం అందిస్తామని స్నేహ హస్తాన్ని చాచిన ఇజ్రాయెల్

ఇండియా కు నీళ్ల సాయం అందిస్తామని స్నేహ హస్తాన్ని చాచిన ఇజ్రాయెల్

ఇండియాలో అనేక ప్రాంతాలు ' నీళ్ళో లక్ష్మణా ' అంటూ నీటి కొరతతో అలమటిస్తున్నాయి. కరువు, వర్షాభావంతో అలమటిస్తున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్..మీకు మేమున్నామంటూ అభయహస్తమిచ్చింది. తన స్నేహ హస్తాన్ని చాచింది. డెజర్ట్ టెక్నాలజీల్లో.. అంటే నీటి వినియోగం, ఆదాలో ప్రపంచ దేశాల్లోనే అగ్ర స్థానంలో ఉన్న ఆ దేశం ఇలా సపోర్ట్ ఇవ్వడం శుభ పరిణామమని అంటున్నారు. ఇజ్రాయెల్ లో నిజానికి 60 శాతం భూమి ఎడారి ప్రాంతం. మరో 20 శాతం భూమి సెమీ-ఆరిడ్ రీజన్..అది పాక్షిక మాగాణి ప్రాంతం. అయితే డెజర్ట్ అగ్రికల్చర్, ఇరిగేషన్, డీశాలినేషన్ (సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేయడం), ఆక్వాకల్చర్, ఎఫారిస్టేషన్, జలవనరుల యాజమాన్య నిర్వహణ వంటి రంగాల్లో ఆ దేశం ఎంతో అభివృద్ద్ధిని సాధించింది. ' భారత్ తో మా భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో మేం వాటర్ మేనేజిమెంట్ వంటి అంశాల్లో మీ దేశానికి పూర్తిగా సహకరిస్తాం ' అంటున్నారు ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా. నీటి కొరతను ఎదుర్కొనేందుకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు, ప్రజల్లో చైతన్యం పెంచేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 17 న ' వాటర్ మేనేజిమెంట్ వాల్డ్ డే ' గా పాటిస్తున్నారు. ఇండియాలో రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి అనేక రాష్ట్రాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అందువల్లే తమ దేశ జల నిపుణులను ఇండియాకు పంపుతామని, నీటి ఆదాలో తీసుకోవలసిన మెళకువలను, వర్షపు నీటిని ఎలా వినియోగించుకోవాలో తెలిపే అధునాతన టెక్నాలజీని వారు వివరిస్తారని రాన్ మల్కా పేర్కొన్నారు.

గుజరాత్ లోని భుజ్ దాదాపు ఎడారి ప్రాంతం.
అలాంటి చోట ఇండో-ఇజ్రాయెలీ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద అక్కడి రైతులకు పాయిల్ తోటల పెంపకాన్ని ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తోంది. నీరు ఎక్కువగా అవసరంలేని ఈ తోటల పెంపకంతో రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అలాగే.. భారత ప్రజల ప్రధాన ఆహార వనరు అయిన వరి పంటకి నీరు పెద్దగా అవసరం లేకుండానే నారుమళ్లు ఎలా వేయవచ్చో … అందుకు సంబంధించిన లేటెస్ట్ వ్యవసాయ విధానాలను ఇజ్రాయెల్ నిపుణులు బోధిస్తారు. బహుశా ఇజ్రాయెల్ ఇస్తున్న ప్రోత్సాహంతోనే ప్రధాని మోదీ..2024 నాటికల్లా మన దేశంలోని అన్ని ప్రాంతాలకూ మంచి నీరు ఇవ్వగలుగుతామని చెబుతున్నారు. ఇందులో భాగంగా..కొత్తగా వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజిమెంట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. వ్యవసాయం, నీటి పారుదలరంగాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకొని 2024 సంవత్సరానికల్లా మన దేశాన్ని 5 బిలియన్ డాలర్ల ఎకానమీ సాధించగలిగే స్థాయికి తేవాలన్నది కూడా మోదీ ప్రభుత్వ ఆశయం. 2030 నాటికి ప్రపంచ దేశాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అందువల్లే ముఖ్యంగా ఇండియా.. ఇప్పటినుంచే ఈ సమస్య పరిష్కారానికి ఇజ్రాయెల్ వంటి దేశాల సహకారం కోరుతోంది.

Back to Top