బస్సులో ఊపిరాడక చనిపోయిన చిన్నారి
- June 17, 2019
దుబాయ్‌లో ఓ చిన్నారి బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. సెంటర్ ఫర్ మొమొరైజింగ్ కురాన్కి చెందిన బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ కోజ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, బాలుడు బస్సులో వుండిపోయిన విషయాన్ని బస్ డ్రైవర్, సూపర్వైజర్ గుర్తించకుండానే డోర్స్ క్లోజ్ చేయడంతో 9 గంటలపాటు బస్సులో చిన్నారి వుండిపోయాడు. ఈ క్రమంలో బాలుడు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్నీ, సూపర్వైజర్నీ ప్రశ్నిస్తున్నారు. బాలుడ్ని భారతదేశంలోని కేరళకు చెందిన మొహమ్మద్ ఫర్హాన్‌గా గుర్తించారు. తన సోదరి పెళ్ళి కోసం చిన్నారి తన కుటుంబంతో కలిసి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి తండ్రి ఫైజల్ కెపి అనీ కేరళకు చెందినవారనీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..