పీఎఫ్ అకౌంట్ ఉంటే రూ.6 లక్షల ఉచిత ఇన్సూరెన్స్!
- June 18, 2019
రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రతే లక్ష్యంగా వేతనంలో కొంత మొత్తాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేస్తుంటారు. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది ఒకటి. దీని నిర్వహణ బాధ్యతలన్నీ ఈపీఎఫ్‌వో చూసుకుంటుంది. ఈపీఎఫ్ అకౌంట్‌తో మూడు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కవర్ అనేవి ఇందులో ఉంటాయి. ఇన్సూరెన్స్ కవర్ విషయానికి వస్తే.. ఈపీఎఫ్‌వో సబ్‌స్ర్కైబర్లకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. ఈ పాలసీ ఇతర పాలసీల మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. నెలకు రూ.15000లోపు వేతనం కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. రూ.6లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలసిన అవసరం లేదు. కంపెనీయే బేసిక్ శాలరీలో 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.75లను నెలకు పాలసీకి చెల్లిస్తుంది. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఒక సంస్థలో 20 లేదా ఆపై సంఖ్యలో ఉద్యోగులు ఉంటే ఈపీఎఫ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు