నగ్నంగా అమలాపాల్..సమంత రియాక్షన్..
- June 19, 2019
ప్రముఖ నటి అమలాపాల్ నటించిన కొత్త సినిమా 'ఆడై' టీజర్ విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను 'ఆమె' పేరిట విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ దీన్ని విడుదల చేశారు. 'ఆడై' సినిమాకు సంబంధించిన పోస్టర్లో అమలాపాల్ అరకొర దుస్తులతో కనిపించగా.. ప్రస్తుతం విడుదలైన టీజర్లో పూర్తి నగ్నంగా కనిపించి దుమారం రేపింది.
ఇప్పటి వరకు కోలీవుడ్‌లో ఏ హీరోయిన్ చేయని అమలాపాల్ చేసి చూపించింది. రత్నకుమార్ దర్శకత్వం వహించిన 'ఆడై' టీజర్లో ఆరంభంలో కూతురు కనిపించడంలేదని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం, ఒక సస్పెన్స్ వాతావరణంలో నెలకొంటుంది. అఖర్లో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలో అమలాపాల్ నటించడంతో.. ఆమె డేరింగ్ అటెంప్ట్ చేయడాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ టీజర్ గురించి అమలా పాల్ ట్విటర్ ద్వారా స్పందించింది. 'ఆడై సినిమా టీజర్‌ను కరణ్ జోహార్ విడుదల చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొంది.
ట్విట్టర్ వేదికగా సమంత.. 'ఆడై' టీజర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.'ఆడై' టీజర్ చాలా అద్భుతంగా ఉందని అమలాపాల్‌కు సామ్ కితాబిచ్చారు. అంతేకాదు.. ఆల్ ది బెస్ట్ అమలా.. అంటూ ఈ టాలీవుడ్ హీరోయిన్ చెప్పుకొచ్చారు. నిజంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు తాను ఈ సినిమా చూస్తానా..? అనే ఆతృత తనలో పెరిగిందని, సినిమా ఎలా ఉంటుంది..? సినిమా కథేంటి..? సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు సమంత తన ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..