సేదతీరేందుకు యూరప్ వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలి

- June 19, 2019 , by Maagulf
సేదతీరేందుకు యూరప్ వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలి

అమరావతి: ఈ తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు. నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కాబోవడం లేదని, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, తాను విదేశాలకు వెళ్లాల్సి వుందని అన్నారు ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని తెలుపుతూ ఓ లేఖను టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఇవ్వాగా, వారు దీన్ని నేడు ప్రహ్లాద్ జోషికి అందించనున్నారు. తన కార్యక్రమం ముందుగా ఖరారై పోయిందని, ఆ తరువాతే సమావేశపు ఆహ్వానం తనకు అందిందని పేర్కొన్న చంద్రబాబు, అన్ని అంశాలపై తమ అభిప్రాయాలను తెలుపుతూ లేఖను పంపుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ నెల 24 వరకూ చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com