ఈత సరదా, ఇద్దర్ని మింగేసింది

- June 19, 2019 , by Maagulf
ఈత సరదా, ఇద్దర్ని మింగేసింది

మస్కట్‌: సముద్రంలో ఈత సరదా ఇద్దర్ని బలి తీసుకుంది. మరో ఆరుగుర్ని రాయల్‌ ఒమన్‌ పోలీసులు ప్రాణాలతో బయటకు తీశారు. విలాయత్‌ ఆఫ్‌ సీబ్‌ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీబ్‌లోని సూర్‌ అల్‌ హాదిద్‌ బీచ్‌ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా, కోస్ట్‌గార్డ్‌ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. భారీ కెరటాల ధాటికి యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. వీరిలో ఆరుగుర్ని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రక్షించగలిగారు. మరో ఇద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్బంగా అధికారులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com