వరల్డ్ కప్ లో భారత్‌కు ఎదురుదెబ్బ
- June 19, 2019
వరల్డ్ కప్లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధావన్ వేలికి గాయమైంది. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చాడు. ముందు జాగ్రత్తగా రిషబ్ పంత్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేసినప్పటకీ…ధావన్ గాయంపై టీమ్ మేనేజ్‌మెంట్ కొన్ని రోజులు వేచి చూడాలని నిర్ణయించింది. అయితే ధావన్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో ఆరు వారాల కంటే ఎక్కువే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు. ధావన్ స్థానంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే ఉన్న రిషబ్ పంత్ జట్టుతో కలవనున్నాడు. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..