ఇరాన్ గగనతలంపై విమానాల నిషేధం, అమెరికన్ ఆపరేటర్లకు ఎఫ్ఎఎ ఆదేశం
- June 21, 2019ఇరాన్ గగనతలంపై అమెరికన్ విమానాల ప్రయాణాలను నిషేధిస్తూ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఇరాన్ గగనతలంపై సంచరిస్తున్న డ్రోన్‌ను ఇరాన్ దళాలు కూల్చివేసిన నేపథ్యంలో ఎఫ్ఎఎ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా - ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు పౌర విమానయానానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ గగనతలం మీదుగా విమానాల ప్రయాణాన్ని నిషేధించటంతో ఉత్తర, అమెరికా నుండి తూర్పు ఆసియా దేశాలకు వచ్చే విమానాలపై తీవ్ర ప్రభావం పడనుంది. డ్రోన్ కూల్చివేత నేపధ్యంలో అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ న్యూయార్క్ నుండి ముంబయి వచ్చే తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే తమ విమాన సర్వీసులను మార్గంలో భద్రత, సురక్షిత పరిస్థితులను సమీక్షించిన అనంతరం పున్ణప్రారంభిస్తామని వెల్లడించింది. అంతకు ముందు అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ విమానాలు ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించబోవని ప్రకటించాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ